ప్రముఖ నటుడు విజయకాంత్ కు సోకిన కరోనా

Thursday, September 24th, 2020, 04:06:16 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారత్ లో రోజురోజుకీ పెరుగుతోంది. గత కొద్ది రోజుల నుండి భారత్ లో భారీ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా ప్రముఖ నటుడు విజయకాంత్ కరోనా వైరస్ భారిన పడ్డారు. తమిళనాట రాజకీయాల్లో, సినిమాల్లో చురుగ్గా ఉండే విజయకాంత్ తాజాగా కరోనా వైరస్ భారిన పడ్డారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్తితి నిలకడగా ఉంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సెప్టెంబర్ 22 న కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ కాగా, ప్రస్తుతం చెన్నై లోని ఎం. ఐ. ఓ.టీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.

అయితే విజయకాంత్ త్వరలోనే కోలుకొని డిశ్చార్జ్ అవుతారు అంటూ వైద్య సిబ్బంది తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారు అని, అదే తరహాలో ఆరోగ్య పరీక్షలు చేయించు కోగా, స్వల్ప లక్షణాలతో కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు.