వరల్డ్ టాప్ రెస్టారెంట్లలో ఫలక్ నామా ‘అడ్దా’!

Saturday, April 11th, 2015, 01:08:03 PM IST


హైదరాబాద్ కు మణిహారంగా నిలిచిన ఫలక్ నామా ప్యాలెస్ ఘనత అందరికీ తెలిసిందే. కాగా నిజాం నవాబులు నిర్మించిన ఈ ఫలక్ నామా ప్యాలెస్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. అలాగే భారీ ఈవెంట్లు, ధనవంతుల వివాహాది శుభకార్యాలు ఈ ప్యాలెస్ లో కన్నుల పండుగగా జరగడం తెలిసిందే. అయితే ఈ ప్యాలెస్ లోని ‘అడ్డా’ రెస్టారెంట్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ మేరకు వరల్డ్ లో టాప్ రెస్టారెంట్ల జాబితాలో ‘అడ్డా’ స్థానం సంపాదించుకుంది. అయితే హైదరాబాద్ లోని ఏ ఇతర రెస్టారెంటుకు ఇంతటి అరుదైన గౌరవం దక్కలేదు. ఇక జెట్ లైఫ్ స్టైల్ పబ్లికేషన్ ‘ఎలైట్ ట్రావెలర్’ నిర్వహించిన రీడర్స్ పోల్ లో ‘అడ్డా’ వందవ స్థానాన్ని దక్కించుకుంది.