సీఎం మాట్లాడుతాడంటూ వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీకి ఫేక్ కాల్..!

Thursday, September 10th, 2020, 12:17:19 AM IST


ఈ మధ్య ఆఫీసర్లమంటూ ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేయడం, మాయ మాటలు చెప్పి వారిని బోల్తా కొట్టించి డబ్బులు లాగడం వంటి కేసులు పెరిగిపోతున్నాయి. అయితే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీకి కూడా ఫేక్ కాల్ వచ్చింది. సీఎం జగన్ మీతో మాట్లాడుతారంటూ విశాఖకు చెందిన జగ్జీవన్ రామ్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. అయితే ఎమ్మెల్యే రజినీకి అతడి తీరుపై కాస్త అనుమానం వచ్చింది.

అయితే అతడితో ఫోన్ మాట్లాడుతూనే డీజీపీకి, ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఫోన్ కాల్స్ ఆధారంగా నింధితుడుని అరెస్ట్ చేశారు. అయితే కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌కు కూడా ఇతనే ఫోన్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. గతంలో ఇండస్ట్రీస్ ప్రాజెక్టు డైరెక్టర్‌ పేరుతో వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌కు కూడా శ్రీనివాస్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వ పథకం పేరు చెప్పి మోసానికి పాల్పడే ప్రయత్నం చేశాడు.