బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్‌బుక్ అకౌంట్‌పై నిషేదం..!

Thursday, September 3rd, 2020, 02:59:32 PM IST

bjp mla rajasingh

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ షాకిచ్చింది. ఆయన ఫేస్‌బుక్ అకౌంట్‌పై నిషేదం విధించింది. తమ విధానాలకు వ్యతిరేకంగా హింస, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆయన పోస్టులు ఉంటున్నట్టు ఫేస్‌బుక్ ప్రతినిధులు తెలిపారు.

అయితే దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్ నా పేరుతో కొందరు ఫేస్‌బుక్ పేజీలు తెరిచినట్లు నా దృష్టికి వచ్చిందని, వాటిని తొలగించినందుకు ఫేస్‌బుక్‌కి ధన్యవాదాలు తెలిపారు. అయితే నా అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీని కూడా 2018లో తొలగించారని దాన్ని పునరుద్ధరించాలని ఫేస్‌బుక్‌కి మెయిల్ చేస్తున్నట్టు మీడియాకు తెలిపాడు. ఇదిలా ఉంటే గతంలో కూడా రాజాసింగ్ పెట్టిన విద్వేషపూరిత పోస్టులను ఫేస్‌బుక్ తొలగించింది. కాగా ఫేస్‌బుక్ కంటెంట్ పాలసీలను తరచూ ఉల్లంఘిస్తున్న వారిలో రాజాసింగ్ ప్రథమ స్థానంలో ఉన్నట్టు సమాచారం.