కీసర ఎమ్మార్వో నాగరాజుది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ హత్యే!

Tuesday, October 20th, 2020, 03:51:56 PM IST

ఇటీవల చంచల్ గూడ జైలులో కీసర మాజీ తహశీల్దార్ ఆత్మహత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అవినీతి కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన నాగరాజు జైలులో ఆత్మహత్య చేసుకోవడం పట్ల కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మార్వో నాగరాజు మృతి పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి అని కుటుంబ సభ్యులు అంటున్నారు.

నాగరాజు ది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్యే అని కుటుంబీకులు అంతా ఆరోపణలు చేస్తున్నారు. జైల్లో ఆత్మహత్య ఎలా సాధ్యం అని, ఆత్మహత్య చేసుకుంటే జైలు సిబ్బంది ఏం చేశారు అంటూ నిలదీస్తున్నారు. జైలు సిబ్బంది పై ఎందుకు కేసు నమోదు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఏసీబీ కేసుల్లో వాస్తవాలు లేవు అని, తమ వద్ద ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయం లో పూర్తి స్థాయిలో విచారణ కి ఆదేశాలు జారీ చేయాలి అని, సీబీఐ దర్యాప్తు కూడా కోరతాం అని, కోర్టులో పిటిషన్ వేస్తామని కుటుంబ సభ్యులు అంటున్నారు.