పోస్కో అధికారులు రావాలంటే ఉద్యమాన్ని అణచివేయాలి – సబ్బం హరి

Tuesday, March 9th, 2021, 02:29:33 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయం లో అధికార పార్టీ తీరు పై మాజీ ఎంపీ సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి, ఎంపీ విజయసాయి రెడ్డి కి అవాస్తవాలు మాట్లాడటం అలవాటు అయిపొయింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయం లో వైసీపీ నేతలు భాగస్వాములైన విషయం అందరికీ తెలుసు అంటూ ఆరోపించారు. అయితే స్టీల్ ప్లాంట్ విషయం లో ప్రజలను మభ్య పెట్టాలని చూడటం సరైన పద్దతి కాదు అని వ్యాఖ్యానించారు. అయితే సీఎం జగన్ తో మాట్లాడిన తర్వాతే కేంద్రం ప్రైవేటీకరణ పై ముందుకు వెళ్ళింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేసుల నుండి రక్షించండి అని బేరమాడటమే వైసీపీ నేతలకు సరిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇంతలా ఉద్యమం జరుగుతుంటే అడ్డుకుంటుంది ఎవరు అంటూ సూటిగా ప్రశ్నించారు.

పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసేలా శాయశక్తులా కృషి చేస్తున్నారు అని ఆరోపించారు. పోస్కో అధికారులు రావాలంటే ఉద్యమాన్ని అణచివేయాలనీ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ ఎంపీ లు రాజీనామాలు చేస్తే పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వస్తారు అని అన్నారు. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చాక ఒక్క పరిశ్రమ అయినా ఏర్పాటు అయిందా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే రాష్ట్రం నుండి వెళ్లిపోయిన పరిశ్రమల జాబితా తమ వద్ద ఉందని అన్నారు. పోస్కొ ఒడిషా లో పరిశ్రమ ను ముట్టుకోలేదు అని, అక్కడి సీఎం ఒప్పుకోలేదు అని, సీఎం జగన్ ఒప్పుకున్నందుకు వలనే ప్రైవేటీకరణ పై అడుగులు ముందుకు వేసింది అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమ్మతి లేకుండా కేంద్రం ముందుకు వెళ్ళలేదు అని తేల్చి చెప్పారు. అయితే ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించు కోవాలి అంటే సీఎం జగన్ వలనే సాధ్యం అని, ఉద్యమాన్ని జగన్ నడిపించాలి అని అన్నారు.