జగన్, పవన్ ల పై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్

Wednesday, March 10th, 2021, 03:51:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో జన సేన పార్టీ భారీ ఓటమి చవి చూసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మేరకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గెలిచినా ఓడినా పవన్ ప్రజలను అంటి పెట్టుకొని ఉండటం అభినందనీయం అని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా, పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల కి దూరం కాకుండా, ప్రజల కొరకు ఉండటం పట్ల ఇప్పటికే పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సైతం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు ముందు నుండే వైఎస్ జగన్ తో స్నేహం ఉందని చెప్పుకొచ్చారు. సీఎం అవ్వాలన్న జగన్ ఆకాంక్ష నెరవేరింది అని వ్యాఖ్యానించారు. అయితే మరో ముడెళ్ళ పాలన తర్వాతే జగన్ పాలన ఎలా ఉందో తెలుస్తుంది అంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అయితే ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.