సీఎం జగన్‌కి మాజీ ఎంపీ హర్షకుమార్ అల్టీమేట్ సవాల్..!

Friday, October 23rd, 2020, 04:45:17 PM IST

ఏపీలో నిబంధనలు పాటించని వాహనదారులకు భారీగా జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాలో రూల్స్ పాటించని వాహనదారులకు సీఎం భరత్ ఏ విధంగా అయితే భారీగా జరిమానాలు పెంచాడో ఇవి కూడా అలానే ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ee భారీ జరిమానాలను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్‌కి మాజీ ఎంపీ హర్షకుమార్ అల్టీమేట్ సవాల్ విసిరారు.

సీఎం జగన్ కాన్వాయ్ గోదావరి నాలుగో వంతెనపై ప్రయాణిస్తే జగన్ ఏం చెప్పినా చేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకోమంటే కూడా తప్పుకుంటానని ఇదే నా సవాల్ అని పేర్కొన్నాడు. తాను పుట్టిన తర్వాత ఇంత అసహ్యంగా రోడ్లు ఎప్పుడూ లేవని దుయ్యబట్టారు. జాతీయ రహదారుల్ని మరమ్మతులు చేశాకే టోల్‌ వసూలు చేయాలని, అప్పుడే వాహనాలకు జరిమానాలు విధించాలని అన్నాడు.