అంతర్వేది ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు..!

Friday, September 11th, 2020, 01:00:33 PM IST

ఏపీలోనీ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది ఆలయం రాజోలు నియోజకవర్గంలో ఉందని అయితే అక్కడ జనసేన రెబల్ ఎమ్మెల్యే ఉండడంతో జనసేన, బీజేపీలు అంతర్వేది రథం ఘటనను రాజకీయం చేస్తున్నాయని అన్నారు.

అయితే ఆర్ఎస్ఎస్ పేరుతో కాపు కులాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ మతాభిమానంతో, జనసేన కులాభిమానంతో ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకి కులాభిమానం ఎక్కువని, చిరంజీవిని సీఎం చేయాలనేది ఆయన లక్ష్యమని అన్నారు. దళిత యువకుడికి శిరోముండనం చేయిస్తే ఎందుకు సీబీఐతో విచారణ చేయించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు దళితులపై చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా సీతానగరం శిరోముండనం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.