మళ్ళీ సొంత గూటికి చేరబోతున్న మాజీ ఎంపీ హర్షకుమార్..!

Saturday, October 3rd, 2020, 07:37:26 AM IST

మాజీ ఎంపీ హర్షకుమార్ సొంత గూటికి చేరనున్నారు. తాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించాడు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్దమయ్యానని, త్వరలోనే ఆయనను కలిసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని అన్నారు. దేశంలో పేద, దళిత, మైనారిటీ ప్రజలకు అండగా ఉండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే అని అన్నారు.

అయితే ఉత్తరప్రదేశ్‌లో దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో బాధితులకు అండగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక చేసిన పోరాటం చూస్తుంటే ఇందిరాగాంధీ రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నారు. అటు ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని, దళితులపై దాడులు పెరిగాయని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి, తన కేసుల మాఫీ గురించి కేంద్రం కాళ్లు పట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.