సీఎం జగన్ కి నోటీసులు ఇవ్వాలి – మాజీ ఎంపీ హర్షకుమార్

Wednesday, March 17th, 2021, 06:15:07 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి సీఐడీ నోటీసులు ఇవ్వడం పట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారం లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కి ఇచ్చినట్లే సీఎం జగన్ కీ నోటీసులు ఇవ్వాలి అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట దళితుల నుండి బలవంతంగా భూములు లాక్కున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములను దళితుల నుండి లాక్కున్న వివరాలను సీఐడీ డీజీ అనిల్ కుమార్ అందజేస్తాం అన్నారు అని చెప్పుకొచ్చారు. అయితే దళితులకు ఇందిరాగాంధీ, రాజీవ్, ఎన్టీఆర్, వైఎస్సార్ ఇచ్చిన భూముల్ని జగన్ లాక్కున్నారు అని, ఈ వ్యవహారం లో సీఎం జగన్ కి నోటీసులు ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హర్ష కుమార్ వ్యాఖ్యనించారు.