టీడీపీ ని వీడిన మరో కీలక నేత…కారణం అదేనట!

Sunday, September 27th, 2020, 11:12:48 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తెలుగు దేశం పార్టీ పరిస్థతి అగమ్య గోచరంగా తయారైనట్లు అనిపిస్తోంది. ఇప్పటికే ఈ పార్టీ కి చెందిన కీలక నేతలు పార్టీ కి రాజీనామా చేశారు. అందులో ఎమ్మెల్యే లు కూడా ఉన్నారు. అయితే విజయ నగరం జిల్లాలో పార్టీ లో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు పార్టీ కి గుడ్ బై చెప్పారు. ఆదివారం నాడు ఒక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే పార్టీ ను వీడడనికి గల కారణాలు తెలిపారు.

తెలుగు దేశం పార్టీ లో పరిస్తుతులు బాగాలేవు అని, సుదీర్ఘ కాలం గా తెలుగు దేశం పార్టీ లో పని చేసినా గుర్తింపు లేదు అని, ఆత్మ గౌరవం, ఆత్మ స్థైర్యం తో పుట్టిన పార్టీ ప్రస్తుతం కనుమరుగు అయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీ వేరు, ఇప్పటి తెలుగు దేశం పార్టీ వేరు అని అన్నారు. చంద్రబాబు నాయుడు మా లాంటి వాళ్లకు గౌరవం ఇవ్వడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలవడం మాత్రమే కాక, ప్రభుత్వ విప్ గా కూడా పని చేశారు. తెలుగు దేశం పార్టీ కి ఈయన రాజీనామా తో పెద్ద దెబ్బ తగిలింది అని చెప్పాలి.