టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే..!

Thursday, August 27th, 2020, 04:45:26 PM IST

ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది సీనియర్లు పార్టీనీ వీడడంతో టీడీపీ కోలుకోలేని పరిస్థితికి చేరుకుంది. అయితే కొద్ది రోజుల క్రితం టీడీపీనీ వీడిన మరో నేత అధికార పార్టీ వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.

మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రేపు వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే విశాఖను రాజధానిగా టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్న పంచకర్ల రమేష్ బాబు తాజాగా వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.