కాంగ్రెస్ ను వీడిన మాజీ ఎమ్మెల్యే…ఉత్తమ్ కి రాజీనామా లేఖ..!

Sunday, February 21st, 2021, 02:05:04 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ కి మరొక షాక్ ఎదురైంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పార్టీ కి రాజీనామా చేశారు. అయితే గడిచిన ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గా పోటీ చేసిన కూన పరాజయం పాలు అయ్యారు. అయితే ఈ మేరకు టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తన రాజీనామా లేఖ అందించారు. రాజీనామా లేఖ పంపిన ఆయన ప్రస్తుతం బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. బీజేపీ కి చెందిన జాతీయ నాయకుల సమక్షం లో పార్టీ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే బిక్షపతి యాదవ్ కుటుంబం ఇలానే బ్జో చేరగా, ఇప్పుడు కూన శ్రీశైలం గౌడ్ పార్టీ ను వీడటం కాంగ్రెస్ కి గట్టి దెబ్బే అని చెప్పాలి.