బిగ్ న్యూస్: హైకోర్ట్ ను ఆశ్రయించిన ఈటెల రాజేందర్ కుటుంబం

Tuesday, May 4th, 2021, 12:35:33 PM IST


తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అయితే భూ కబ్జా ఆరోపణల విషయం లో మాజి మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబం ఉన్నత న్యాయస్థానం ను ఆశ్రయించడం జరిగింది. అయితే ఈటెల రాజేందర్ సతీమణి, కుమారుడు, జమునా హెచరీస్ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తమ భూముల్లో చట్ట విరుద్ధం గా సర్వే చేశారు అంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగింది. అయితే తమను సంబంధిత భూముల్లో సర్వే చేసి బోర్డులను పెట్టారు అంటూ హైకోర్ట్ కి వివరించడం జరిగింది. అయితే తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలను జారీ చేయాలని కోరారు. అయితే బలవంతపు చర్యలు తీసుకోకుండా డీజీపీ, విజిలెన్స్, కలెక్టర్ ను ఆదేశించాలని కోరడం జరిగింది.