వేడెక్కిన రాజకీయం: దేవినేని ఉమా అరెస్ట్!

Tuesday, January 19th, 2021, 02:22:47 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ కి, ప్రతి పక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ కి మాటల యుద్దాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గొల్లపూడి లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు దేవినేని ఉమా నిరసన చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చంశనీయం అయింది.

అయితే ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు దేవినేని ఉమా వైసీపీ తీరును నిరసిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే అక్కడికి వల్లభనేని వంశీ, వైసీపీ కార్యకర్తలు చేరుకోవడం తో పరిస్తితి తీవ్ర స్థాయిలో కి చేరకుండా ఉండేందుకు దేవినేని ఉమా ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ స్టేషన్ కి తరలించే మార్గం మధ్య లో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్వర్యంలో మహిళలు వాహనాన్ని అడ్డుకున్నారు. అయితే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తే ఇలా పోలీసులు అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘీబవం తెలిపేందుకు టీడీపీ నేత బుద్దా వెంకన్న ను సైతం గృహ నిర్భధం చేశారు. అయితే దేవినేని ఉమా తీరు పై వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మీడియా వేదిక గా చర్చకు రావాలని మంత్రి కొడాలి నాని తెలిపినా ఉమా వినకుండా రోడ్డు ఎక్కారు అంటూ విమర్శించారు. అయితే గొల్లపూడి లో సెక్షన్ 144 మరియు సెక్షన్ 30 లు అమలు లో ఉన్నాయి అని తెలిపారు.