నూతన నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు

Sunday, August 30th, 2020, 07:45:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. దళితుల పై జరుగుతున్న దాడుల విషయం లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ కి చెందిన వైసీపీ నాయకులు రెచ్చిపోతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని నక్క ఆనంద్ బాబు ఘాటు విమర్శలు చేశారు. బడుగులని హింసిస్తూ, వైసీపీ నేతలు రాక్షస ఆనందం పొందుతున్నారు అని అన్నారు. అయితే విశాఖ కేసులో నూతన నాయుడు పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన నాయుడిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ను నిలదీశారు.

అయితే నూతన్ నాయుడు వైసీపీ సిద్ధాంత కర్త కాబట్టే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం పై ఆనంద్ బాబు ఆరోపణలు చేశారు. అధికారం లోకి రావడానికి రాష్ట్రంలోని దళితులు కృషి చేస్తే, వారి పైనే కక్ష కట్టడం దారుణం అని తెలిపారు. దళితుల ఓట్ల తో గెలిచి దాడులు చేయడం దారుణం అంటూ మండిపడ్డారు.అయితే విజయవాడ గుంటూరు జిల్లాలలో మాత్రమే కాకుండా పలు చోట్ల తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు ఈ దాడుల ను నిరసిస్తూ దీక్ష కి దిగారు.