సీఎం జగన్ అలా చేయడం దురదృష్టకరం.. మాజీ ఐఏఎస్ ఐవైఆర్‌..!

Sunday, April 5th, 2020, 12:10:30 AM IST

ఏపీ సీఎం జగన్ తీరుపై మాజీ ఐఏఎస్ ఐవైఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరోనాను ఎదుర్కొవడంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి మీడియాతో సీఎం జగన్ మాట్లాడింది సరికాదని ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న కరోనా సమస్య మతానికి సంబంధించింది కాదని అన్నారు.

అయితే రవిశంకర్‌గారి శిష్యులైనా, పాల్‌గారి శిష్యులైనా, ఈనాటి తబ్లీగీ సభ్యులైనా ఒక మత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని, ఎప్పుడైనా ప్రభుత్వం కోరితే ఆ సమావేశానికి హాజరైన వారందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి సహకరించకుండా, వైద్య సిబ్బందిపై దాడి చేయడం వంటివి చేయడం గర్హనీయమని అన్నారు. అయితే ఇలాంటి వాటిని ఖండించి వైద్య సిబ్బంది మనో ధైర్యం దెబ్బతినకుండా మాట్లాడటం మానేసి మిగిలిన ఆధ్యాత్మిక సమావేశాలతో దీనిని కూడా ముడిపెట్టి సమస్యను పేలవం చేయడానికి జగన్ ప్రయత్నించడం దురదృష్టకరమని ఆయన వాపోయారు.