గౌతమ్ గంభీర్ కి సోకిన కరోనా…ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో..!

Friday, November 6th, 2020, 03:50:40 PM IST

కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో ఉగ్ర రూపం దాల్చుతోంది. వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో కరోనా వైరస్ మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తాజాగా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కరోనా వైరస్ మహమ్మారి భారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తనకు ఇటీవల జరిగిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిన విషయాన్ని వెల్లడించారు. అయితే కరోనా వైరస్ సోకిన విజయం తెలిసిన తరువాత సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటున్నట్లు తెలిపారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా కరోనా వైరస్ నిబంధనలు పాటించాలి అని, ఈ మహమ్మారిని తేలిగ్గా తీసుకోవద్దు అని, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. అయితే చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటం తో ఈ మహమ్మారి ఇంకా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.