మాజీ ముఖ్యమంత్రికి కీలక పదవి అప్పగించిన కాంగ్రెస్ పార్టీ!

Saturday, February 22nd, 2020, 07:42:11 AM IST

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఏపీసీసీ ఆఫీస్ బేరర్స్, డీసీసీ అద్యక్షులని ఎన్నుకుంది. అయితే 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులు పేర్లని ఖరారు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ కి ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకుంది. అయితే 29 మందితో కో ఆర్డినేషన్ కమిటీ మరియు 12 మందితో ఏర్పాటు చేసిన కమిటీ రాజకీయ వ్యవహారాల్ని చేసుకోనుంది. డీసీసీ అధ్యక్షులుగా 18 మందిని తీసుకున్నట్లు అందులో తెలిపింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి రాజకీయ వ్యవహారాలు, సమన్వయ కమిటీల్లో స్థానాలు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తర్వాత కొన్ని రోజులు ముఖ్యమంత్రి గా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గతంలో కీలక పాత్రని పోషించారు. అయితే కొత్తగా ఇపుడు మరోసారి కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారనేది చూడాల్సి ఉంది. రాజకీయ వ్యవహారాల కమిటీ కి చైర్మన్ గాపీసీసీ అధ్యక్షుడు శైలజానాద్ వ్యవహరించనున్నారు. సమన్వయ కమిటీకి చైర్మన్ గా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ చాందీ ఉండనున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కి రెండు కమిటీల్లో స్తానం దొరకడం విశేషం.