భారత్‌లో కరోనా మరణ మృదంగం.. ప్రతి గంటకు 40 మంది మృతి..!

Thursday, August 13th, 2020, 11:59:45 AM IST

india_corona

భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. ప్రతి గంటకు 40 మంది కరోనా బారిన పడి చనిపోతున్నట్టు తెలుస్తుంది. అయితే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 66,999 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకు మొత్తం 23,96,637 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం అందులో 6,53,622 యాక్టివ్ కేసులు ఉండగా, 16,95,982 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 942 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 47,033కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 8,30,391 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో ఇప్పటివరకు జరిగిన మొత్తం టెస్టుల సంఖ్య 2,68,45,688 కి చేరింది.