భారత్‌లో కరోనా కల్లలోం.. నిమిషానికి 42 కొత్త కేసులు..!

Wednesday, August 12th, 2020, 12:42:08 PM IST

భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. ప్రతి నిమిషానికి 42 కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 60,963 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకు మొత్తం 23,29,638 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం అందులో 6,43,948 యాక్టివ్ కేసులు ఉండగా, 16,39,599 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏకంగా 834 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 46,091 చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 7,33,449 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 70.4 ఉండగా, మరణాల రేటు 2 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.