ప్రైవేట్ ఆసుపత్రులకు ఈటెల రాజేందర్ హెచ్చరిక…వినకపోతే ఇక అంతే!!

Wednesday, August 5th, 2020, 12:19:20 AM IST


కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే కాకుండా, ప్రైవేట్ ఆసుపత్రులకు సైతం కరోనా చికిత్స చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్స కి రోజుకి లక్షల రూపాయల లో బిల్ వేస్తున్నారు ఈ విషయం ప్రభుత్వం దృష్టి కి వెళ్ళడం తో మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను ప్రైవేట్ ఆసుపత్రులు దుర్వినియోగం చేస్తున్నాయి అని మండిపడ్డారు.ఇది సంపాదనకు సమయం కాదు అని,ప్రజలను భయపెట్టి లక్షల రూపాయలు వసూల్ చేయడం సరి కాదు అని, ఇప్పటికే ఒక ఆసుపత్రి పై చర్యలు తీసుకున్నాం అని మీడియా సమావేశం లో తెలిపారు. అయితే ఈ చికిత్స ను వ్యాపార కోణం లో చూడొద్దు అంటూ హితవు పలికారు. మానవత్వం తో సాటి మనిషికి సహాయం చేయాలి అని,చిన్న వైద్యానికి లక్షల్లో వసూలు చేయడం హీనమైన చర్య అని ధ్వజమెత్తారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల తీరు మారకపోతే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. అయితే ఒక్క రోజుకి కరోనా చికిత్స కు గరిష్టంగా 9 వేల రూపాయలకి మించి తీసుకోవద్దు అని అన్నారు.