అలా ఉంటున్న కరోనా బాధితులను నిరంతరం పర్యవేక్షించాలి – మంత్రి ఈటెల రాజేందర్

Friday, August 7th, 2020, 12:51:44 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకొంటుంది. అయితే నేడు జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్ లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి జిల్లా కలెక్టర్ల, మంత్రుల సూచనలు తీసుకోవాలి అని ఆసుపత్రుల కు సూచనలు , సలహాలు చేశారు. అయితే ఐశోలేషన్ లో ఉన్న వారి పట్ల నిర్లక్ష్యం వహించ కూడదు అని మంత్రి ఈటెల నేడు మాట్లాడారు.

ఐశోలేషన్ లో ఉంటున్న కరోనా వైరస్ బాధితులను నిరంతరం పర్యవేక్షించాలి అని ఈటెల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే వైద్యులు సరైన వైద్యం అందేలా చూడాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ కూడా సరైన వైద్యం అందేలా చూడాలి అని కలెక్టర్ లను ఆదేశించారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపధ్యం లో మరొకసారి మంత్రి ఈటెల రాజేందర్ వైద్య అధికారులను, కలెక్టర లను అప్రమత్తం చేశారు.