చిరంజీవికి ఫోన్ చేసిన ఈటల రాజేందర్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా..!

Thursday, November 12th, 2020, 10:48:37 PM IST


తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. సామాన్య ప్రజలతో పాటు ఇప్పటికే పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలు కరోనా బారిన పడగా మూడు రోజుల క్రితం మెగస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించే క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో నేడు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురుంచి అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని ఈటల చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో సీఎం కేసీఆర్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌ వెంటనే టెస్ట్ చేయించుకోగా నెగెటివ్‌ వచ్చినట్లు సమాచారం. అయినప్పటికి ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు సీఎం కేసీఆర్ వెళ్లగా, ఎంపీ సంతోష్ కుమార్‌ హోం క్వారంటైన్‌లో ఉన్నారు.