ఆ రెండు పట్టణాల పై మంత్రి ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

Thursday, September 3rd, 2020, 01:35:21 AM IST

Etela_Rajendar
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆరు నెలల్లో వాటి రూపురేఖలు మారుస్తా అని స్పష్టం చేశారు. అయితే ఈ రెండు మున్సిపాలిటీ ఎల్లో ఉన్న సమస్యల పరిష్కారం తో పాటుగా, మోడల్ టౌన్ లు గా తీర్చి దిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే రెండు పట్టణాలు తనకు రెండు కళ్ళ లాంటివి అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఈటెల రాజేందర్ గతం లో ఆర్ధిక మంత్రి గా ఉన్న సమయం లో ఈ రెండు పట్టణాల కోసం 90 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన విషయాన్ని వెల్లడించారు. అయితే వాటిని పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలి అని అధికారులకు సూచించారు. మురుగు నీరు ఎక్కడా ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని, రోడ్లు,డ్రైనేజీ, పలు పనులు రాబోయే కాలం లో కూడా ఉపయోగపడేలా ఉండాలి అని అన్నారు.