2023 తర్వాత తెరాసకు అధికారం ఉండదు – ఈటెల రాజేందర్

Tuesday, May 18th, 2021, 12:43:52 PM IST


నా పై కక్షపూరితంగా వ్యవహరించవచ్చు కానీ, మా ప్రజల్ని మాత్రం వేధించే ప్రయత్నం చేయొద్దు అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలను కాపాడుకుంటా అని ఈటెల రాజేందర్ అన్నారు. అయితే నాగార్జున సాగర్ లో గెలిచినట్లు ఇక్కడ చేస్తామంటే ప్రజలు పాతరేస్తారు అని వ్యాఖ్యానించారు. అయితే నియోజక వర్గానికి ఇన్ ఛార్జ్ లుగా వస్తున్నవారు ఏనాడైనా ఆపదలో ఆదుకున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ ల గెలుపు లో ఏనాడైనా తోడ్పాటు అందించారా అని నిలదీశారు. అయితే కాంట్రాక్టర్లు,సర్పంచ్ లను బిల్లులు రావు అని బెదిరిస్తున్నారు అంటూ అధికార తెరాస పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గ్రామాలకు 50 లక్షల రూపాయలు, కోటి రూపాయల నిధులు రావాలంటే తమతో ఉండాలని చెబుతున్నారు అంటూ ఈటెల రాజేందర్ అన్నారు.

అయితే ఈ విషయాన్ని అంతా హుజూరాబాద్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు. ఇంత అన్యాయం, ఇంత అక్రమమా, ఇదేం రాజకీయం అని అసహ్యించుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అని, అలా అనుకుంటే భ్రమల్లో ఉన్నట్లే అని అన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు పనికిరావు అని, 2023 తర్వాత తెరాసకు అధికారం ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారో, మేమూ ఆ పని తప్పకుండా చేస్తామని హెచ్చరిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు.మర్యాదగా నడుచుకోండి, మా ప్రజలు నన్ను 20 ఏళ్లుగా గుండెల్లో పెట్టుకున్నారు అని రాజేందర్ అన్నారు. దేవుళ్ళను మొక్కను, ప్రజల హృదయాలనే గుడులు గా భావిస్తా అంటూ ఈటెల రాజేందర్ అన్నారు. అయితే హుజూరాబాద్ ప్రజల్ని ఎవరూ కొనలేరు అని, ఇక్కడి ప్రజలు అనామకులు కాదు అని, దాదాగిరి పద్దతి, హెచ్చరికలను ఆపకపోతే కరీం నగర్ కేంద్రం గా ఉద్యమం చేయాల్సి ఉంటుంది అని అధికార పార్టీ తెరాస కి హెచ్చరికలు జారీ చేశారు.