గాంధీ ఆసుపత్రిలో త్వరలో ఇతర వైద్య సేవలు ప్రారంభం

Monday, October 5th, 2020, 08:41:20 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణం గా చాలా ఆసుపత్రుల్లో ఇతర వైద్య సేవలు నిలిచి పోయాయి. తెలంగాణ రాష్ట్రం లో గాంధీ ఆసుపత్రి కరోనా ఆసుపత్రి గా మారిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఇతర వైద్య సేవలను ప్రారంభిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపద్యం లో దసరా, బతుకమ్మ పండుగ లని ఇంటి వద్దే జరుపుకోవాలి అని మంత్రి సూచించారు. ఈ పండుగల పేరుతో ఎక్కువ మంది కలిస్తే మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని అన్నారు.

అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ తీవ్రత తగ్గిందని, అయితే ఇలానే కట్టడి చేస్తే రాష్ట్రం నుండి కరోనా ను తరిమేయొచ్చు అని అన్నారు. ఆరోగ్య శ్రీ లో మార్పులు చేస్తున్నాం అని, లోపాలను కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు. అయితే కార్పొరేట్ ఆసుపత్రులకు చేరుకుంటున్న రోగులను వెనక్కి పంపకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. అయితే గాంధీ ఆసుపత్రి మినహా ఇతర ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలు మొదలు అయ్యాయి అని, గాంధీ లో కూడా త్వరలో నే ఇతర వైద్య సేవలు ప్రారంభం చేస్తాం అని మంత్రి వ్యాఖ్యానించారు.