సోషల్ మీడియా లో దుష్ప్రచారం చేస్తున్నారు – మంత్రి ఈటెల రాజేందర్!

Monday, June 29th, 2020, 01:44:54 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ నివారణ కట్టడి చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ సోషల్ మీడియా లో దుష్ప్రచారం చేస్తున్నారు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపధ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా లో దుష్ప్రచారం చేస్తున్నారు అని, ప్రభుత్వ ఆసుపత్రికి అర్దరాత్రి వచ్చినా చికిత్స అందజేస్తున్నాం అని వ్యాఖ్యానించారు. వైద్య శాఖ లో 258 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అని, ఒకరు చనిపోయారు అని వివరించారు. ప్రైవేట్ లో పని చేసే వైద్య సైబ్బంది లో 36 మందికి కరోనా వైరస్ సోకింది అని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో వైద్య సిబ్బంది మనో ధైర్యాన్ని దెబ్బ తీయోద్దు అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అందుకోసం అవసరమైతే హైదరాబాద్ లో మరోమారు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. అంతేకాక మంత్రులతో పూర్తి స్థాయిలో సమావేశం అయ్యాక దీని పై కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.