ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ వరాలు ఇచ్చే అలవాటు కేసీఆర్ కి ఉంది – ఈటెల

Wednesday, June 9th, 2021, 04:09:56 PM IST


ఇటీవల తెలంగాణ రాష్ట్రం లో అధికార పార్టీ తెరాస కి రాజీనామా ప్రకటించి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజి మంత్రి ఈటెల రాజేందర్. అయితే అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసమే పనిచేశానని చెప్పుకొచ్చారు ఈటెల రాజేందర్. అయితే ఈ మేరకు మరొకసారి అధికార పార్టీ తెరాస ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫించన్లు రాకపోవడం తో వితంతువులు ఇబ్బందులు పడుతున్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో ఫించన్లు మరియు తెల్ల రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

అయితే అధికారం లోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు మూడు వేల రూపాయల భృతి ఇవ్వాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. అయితే పీవీ జిల్లా కోసం గతంలోనే ప్రతిపాదన తీసుకు వచ్చిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఎన్నికలు ఎక్కడ వస్తే అక్కడ వరాలు ఇచ్చే అలవాటు సీఎం కేసీఆర్ కి ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అయితే తన రాజీనామా తర్వాత గతంలో ఆగిపోయిన పథకాలు అన్ని వస్తాయి అని వ్యాఖ్యానించారు. అలా చేయడం ద్వారా ప్రజలు సంతోష పడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే తాను పార్టీ మారలేదు అని, బలవంతంగా వెళ్లిపోయేలా చేశారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈటెల రాజేందర్ మరొకసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం తో సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.