తెలంగాణలో స్కూళ్లు తెరిచేది అప్పుడే.. మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ..!

Wednesday, August 26th, 2020, 07:22:03 AM IST

దేశంలో ఓ పక్క కరోనా కేసులు పెరుగుతున్నా కేంద్రం మాత్రం అన్‌లాక్ 4 సడలింపులపై దృష్టి పెట్టింది. అయితే స్కూళ్ల పునప్రారంభం మాత్రం ఇప్పుడే ఉండదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం పలు కసరత్తులు చేపడుతుంది.

అయితే తెలంగాణలో స్కూళ్లు తెరిచేది ఎప్పుడు అనే దానిపై మంత్రి ఈటల ఓ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. రాజధాని హైదరాబాద్‌లో తగ్గుముఖం పట్టాయని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 99శాతం మంది కోలుకుంటున్నారని, కరోనా వైరస్‌కు ధైర్యమే అసలైన మందు అని అన్నారు. కేంద్రప్రభుత్వం అనుమతిస్తే స్కూళ్లను రీ ఓపెనింగ్ చేస్తామని స్పష్టం చేశారు.