బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్..!

Saturday, December 19th, 2020, 12:22:05 AM IST

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కొత్త బిక్షగాడి మాదిరిగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. నాలుగు సార్లు ఓడారన్న జాలితో కరీంనగర్ ప్రజలు బండి సంజయ్‌ని గెలిపించారని ఆయనకు ఇదే మొదటి, చివరి పదవి అని అన్నారు. సీఎం కేసిఆర్‌ను జైల్లో పెట్టే దమ్ముందా అని సవాల్ విసిరారు.

అయితే తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ పాల్గొనలేదని, కేసీఆర్‌ గురించి మాట్లాడితే ప్రజలు బండి సంజయ్‌ను ఉరికించి కొడతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమి తెచ్చారో బండి సంజయ్ చెప్పగలరా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సాదాసీదా నాయకుడు కాదని.. తెలంగాణ తెచ్చిన ప్రజా నేత అని ఎర్రబెల్లి అన్నారు.