తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్.. షర్మిల పార్టీలోకి ఏపూరి సోమన్న..!

Thursday, March 11th, 2021, 01:43:06 AM IST


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీనీ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆమె జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ పార్టీల్లోని అసంతృప్త నేతలు షర్మిల పెట్టబోయే పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న కూడా షర్మిల పార్టీలోకి వెళ్ళేందుకు సిద్దమయ్యాడు.

ఈ మేరకు ఆయన మార్చి 15న చలో లోటస్ పాండ్ ప్రకటించారు. ప్రస్తుత తెలంగాణ పరిస్థితి, నా రాజకీయ భవిష్యత్ సంభందించిన అంశాలను ఆలోచన చేసి, దివంగత నేత రాజశేఖరరెడ్డి గారి కూతురు షర్మిలా గారితో మాట్లాడి రాజకీయ మరియు, తెలంగాణలో పార్టీ పరిస్థితుల్ని వివరించి వారి స్పందన అనంతరం తీసుకున్న నిర్ణయం ఇది, సహకరిస్తారని ఆశిస్తున్నట్టు ఫేస్‌బుక్ ద్వారా తెలిపాడు. అయితే కాంగ్రెస్ పార్టీని విమర్శించే ఆలోచన నాకు లేదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేక, సీనియర్లు కూడా వారి భవిష్యత్ పై ఆందోళన చెందుతున్న సందర్భంలో, తెలంగాణ రాష్ట్రంలో నియంత ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే నాకు ఈ నిర్ణయం సరైనది అని అనిపించిందని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుత తెలంగాణ పరిస్థితి , నా రాజకీయ భవిష్యత్ సంభందించిన అంశాలను ఆలోచన చేసి , దివంగత నేత రాజశేఖరరెడ్డి గారి కూతురు…

Posted by DrApoori Somanna on Wednesday, 10 March 2021