అశ్విన్ సెంచరీ… ఇంగ్లాండ్ కి భారీ లక్ష్యం సెట్ చేసిన భారత్

Monday, February 15th, 2021, 04:22:33 PM IST

ఇటీవల ఆసీస్ టెస్ట్ సీరీస్ విజయం తో అదరగొట్టిన టీమ్ ఇండియా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో కూడా అదే సత్తా ను కనబరుస్తోంది. చేపాక్ వేదిక గా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో భారత్ 286 పరుగులకు ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్ 106 పరుగులు చేసి అద్భుత శతకం తో అదరగొట్టాడు. జట్టు స్కోర్ చేయడం లో కీలక పాత్ర పోషించాడు. అయితే విరాట్ కోహ్లి మరొకసారి హాఫ్ సెంచరీ తో కదం తొక్కాడు. అయితే ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 195 పరుగులు ఉండగా, ఈ రెండవ ఇన్నింగ్స్ తో కలిపి మొత్తం ఇంగ్లాండ్ కి టీం ఇండియా 482 పరుగుల భారీ లక్ష్యాన్ని సెట్ చేసింది. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, రెండో టెస్ట్ లో ప్రతీకారం తీర్చుకోవాలని టీం ఇండియా చూస్తోంది.