మొతేరా వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 205 పరులకే ఆలౌట్ అయ్యింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ను భారత స్పిన్నర్లు మరోసారి దెబ్బకొట్టారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ బౌలింగ్‌ను ఎదురుకోవడంలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ ఇబ్బందులు పడ్డారు. అయితే బెన్ స్టోక్స్ 55 పరుగులతో రాణించగా, డాన్ లారెన్స్ 46, ఓల్లీ పొప్ 29, జానీ బెయిర్‌స్టో 28 పరుగులతో పర్వాలేదనిపించారు.
ఇదిలా ఉంటే భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లను పడగొట్టగా, అశ్విన్ 3 వికెట్లు, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీఅసుకున్నాడు. అయితే ఇప్పటికే సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉన్న భారత ఈ మ్యాచ్‌లో కూడా నెగ్గి టెస్టులో తొలి స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తుంది.