భారత స్పిన్నర్ల దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లాండ్.. 112 పరుగులకే ఆలౌట్..!

Wednesday, February 24th, 2021, 07:12:44 PM IST

ప్రపంచంలోని అతి పెద్ద స్టేడియం మొతేరాలో ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ కుప్పకూలిపోయింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ దాటికి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేక వరుసగా పెవిలియన్ బాటపట్టారు.

అయితే ఓపెనర్ జాక్ క్రాలీ(53) అర్థశతకం మినహ మిగతా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలం అయ్యారు. అయితే మంచి ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కూడా 17 పరుగులకే ఔటయ్యాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 6 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3 వికెట్లు, ఇషాంత్ ఒక వికెట్ తీసుకున్నారు. ఏది ఏమైనా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంత తక్కువ స్కోరుకే ఆలౌటవ్వడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం.