చెన్నై టెస్ట్: తోలి ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ 578 పరుగులకు ఆలౌట్

Sunday, February 7th, 2021, 12:22:24 PM IST

ఇంగ్లాండ్ మరియు టీమ్ ఇండియా మధ్యన టెస్ట్ సీరీస్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 578 పరుగులకు ఆలౌట్ అయింది. ఆదివారం నాడు 555 పరుగులతో8 వికెట్లు కోల్పయి మూడవ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 23 పరుగులు సాధించి మిగతా వికెట్ లను కోల్పోయింది. మిగిలిన రెండు వికెట్లు డోమ్ బెస్ ను బుమ్ర ఔట్ చేయగా, 190.1 ఓవర్ కి అండర్సన్ వికెట్ ను అశ్విన్ పడగొట్టాడు. అయితే ఈ మొత్తం ఇన్నింగ్స్ లో కెప్టెన్ జో రూట్ 218 పరుగులతో చెలరేగిపోగా, బెన్ స్టాక్స్ 82 పరుగుల తో అద్భుతంగా రాణించారు. ఇండియా ఇప్పుడు తొలి ఇన్నింగ్స్ కి నిలకడగా రాణించాల్సి ఉంది.