హైదరాబాద్‌లో దారుణం.. ఇంజనీరింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..!

Thursday, February 11th, 2021, 12:09:37 AM IST


మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. నగర శివారులోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా జోడిమెట్లలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

అయితే పక్కా ప్లాన్ ప్రకారమే ఆటోగ్యాంగ్ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే అత్యాచారం చేసిన తర్వాత అమ్మాయిని వివస్త్రను చేసి రోడ్డుపై వదిలేసి నిందితులు పరారయ్యారు. స్థానికులు అమ్మాయిని రక్షించి మేడిపల్లిలో క్యూర్ హాస్పిటల్‌కి తరలించారు. పోలీసులు బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నిందితుల కోసం గాలింపు చేపడుతున్నారు.