వైసీపీ నేతలను వణికిస్తున్న కరోనా.. ఏలూరు ఎంపీకి పాజిటివ్‌గా నిర్ధారణ..!

Thursday, October 8th, 2020, 04:30:24 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్య జనంతో పాటు ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కరోనా బారిన పడి కోలుకోగా, కొద్ది రోజుల క్రితం తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఇటీవల ద్రోణంరాజు శ్రీనివాస్‌లు ఏకంగా కరోనా బారిన పడి చనిపోయారు.

అయితే తాజాగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేడు ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో పాటుగా ఆయన కార్యాలయ సిబ్బందిలో మరో నలుగురికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా గత వారం రోజుల నుంచి తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎంపీ కోటగిరి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.