ఏపీ ఓటర్ల జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం..!

Saturday, January 16th, 2021, 01:03:29 AM IST


ఏపీ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. అయితే ఏపీలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మహిళా ఓటర్లు 2,04,71,506 ఉండగా, పురుష ఓటర్లు 1,99,66,737 ఉన్నారు. ఇక సర్వీసు ఓటర్లు 66,844 ఉండగా, థర్డ్ జెండర్ ఓటర్లు 4,135 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఇదిలా ఉంటే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వివాసస్పదంగా మారాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు, ఏపీ ప్రభుత్వానికి అసలు పడడం లేదు. కోర్టు సూచనలు, ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వ అధికారులు నిమ్మగడ్డని కలిసి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని చెప్పినా నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టేపారేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మరియు వ్యాక్సిన్ పంపిణీ కారణంగా ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.