విజయోత్సవ ర్యాలీలు జరిపేవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి – ఎన్నికల కమిషన్

Sunday, May 2nd, 2021, 05:45:40 PM IST


దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలకి సంబందించిన ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఈ సమయం లో ఆధిక్యం కనబరుస్తున్న పార్టీ కి చెందిన కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటం తో ఎన్నికల సంఘం పలు నిబంధనల తో పాటుగా నిషేధాజ్ఞలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విజయోత్సవ ర్యాలీలు చేపడుతున్నారు ఆయా పార్టీ కి చెందిన వారు. అయితే ఈ విషయం పై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అలా ర్యాలీలు నిర్వహిస్తున్న వారు పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి ఆదేశాలను జారీ చేసింది ఎన్నికల సంఘం. అయితే విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్న వారు పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, అదే విధంగా సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ హెచ్ ఓ ను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోకుండా కొన్ని పార్టీలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి.

దేశం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ దీని తీవ్రత ఎక్కువగా ఉండటం తో ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా భారత్ లో 4 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు, 3,600 కి పైగా కరోనా వైరస్ మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే దీని పట్ల ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.