ఏపీ సీఎం జగన్‌కు షాక్.. సమన్లు జారీచేసిన ఈడీ కోర్టు..!

Saturday, January 9th, 2021, 04:22:11 PM IST

YS_Jagan

ఏపీ సీఎం జగన్‌కి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇటీవల అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది. తాజాగా అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్‌ను ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని సీఎం జగన్‌కు ఈడీ కోర్టు నోటీసులు పంపింది. అయితే సీఎం జగన్‌తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకి కూడా ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.

అయితే జగన్‌ ఆస్తుల కేసులపై దర్యాప్తు చేస్తున్న ఈడీ సీబీఐ కోర్టులో ఆరు ఛార్జిషీట్లు, నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో ఒక ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అయితే నాంపల్లి కోర్టులో దాకలు చేసిన చార్జిషీట్‌ పెండింగ్‌లో ఉండడంతో దానిని స్పెషల్ కోర్టుకు బదిలీ చేయాలని జగతి పబ్లికేషన్‌లో కోరింది. దీంతో ఈ చార్జిషీట్‌ కూడా ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది. అయితే నిన్న ఈ చార్జిషీట్‌పై విచారణ చేపట్టిన ఈడీ కోర్టు సీఎం జగన్ విచారణకు హాజరు అవ్వాలని ఆదేశాలు జారీచేసింది.