జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై మార్గదర్శకాలు విడుదల..!

Wednesday, December 23rd, 2020, 02:00:35 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెలువడినే సంగతి తెలిసిందే. అయితే తాజాగా జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 91 సెక్షన్ ప్రకారం మొదటిసారిగా పాలక మండలి సమావేశంలోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగానలి ఈసీ ఉత్తర్వులలో పేర్కొంది.

అయితే సెక్షన్ 88డీ ప్రకారం గెలిచిన అభ్యర్థులను కార్పొరేటర్లుగా ప్రకటించిన నెల రోజుల లోగానే మొదటి పాలక మండలి సమావేశం జరగాలని పేర్కొంది. అయితే ఈ పాలక మండలి సమావేశం జరిగిన రోజు నుంచి ఆ కార్పోరేటర్ల పదవి కాలం 5 సంవత్సరాలు ఉంటుందని తెలిపింది. అయితే ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం జనవరి 10న ముగియనుండడంతో అప్పుడు తాజాగా గెలిచిన అభ్యర్థులను కార్పొరేటర్లుగా ప్రకటిస్తూ ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.