సీఎం కేసీఆర్‌తో 20 ఏళ్ల అనుబంధం ఉంది.. మంత్రి ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు…!

Tuesday, February 2nd, 2021, 11:34:36 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట మండలం వావిలాల క్లస్టర్ రైతు చైతన్య వేదికను ప్రారంభించిన మంత్రి ఈటల అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన మీద సీఎం కేసీఆర్‌కు అజమాయిషీ ఉందని, ఆయనపై కూడా తనకు అజమాయిషీ ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ తనకు ఇష్టం లేని పని ఎంత చెప్పినా అసలు వినరని, ఇష్టమైన పని చెబితే వెంటనే చేస్తారని చెప్పుకొచ్చారు.

గత కొన్నేళ్లుగా సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో చేస్తున్నారని ఇప్పుడు ఆ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరెంటు కష్టాలు తొలగిపోయాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పంట ఎండే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో ప్లాన్డ్‌గా పంట సాగు జరుగుతుందని ఏ పంట వేస్తే మంచి లాభం వస్తుందన్న విషయం, వచ్చిన పంట ఎక్కడ అమ్మితే మంచి గిట్టుబాటు వస్తుందన్న చర్చకు రైతు వేదికలు వేదిక కావాలని ఈటల చెప్పుకొచ్చారు.