గచ్చిబౌలిలో భూ ప్రకంపనలు.. అసలేం జరుగుతుంది..!

Thursday, October 15th, 2020, 11:03:05 PM IST


హైదరబాద్‌లో భారీ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న నగరవాసులను పలు చోట్ల భూ ప్రకంపనలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వస్తున్నాయి. . మై హోం విహంగ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, టీఎన్జీవో 2 కాలనీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంతాలలో భూమి లోపలి నుంచి శబ్దాలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే దీనిపై స్పందించిన ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఇటీవల బోరబండలో వచ్చిన భూ ప్రకంపనల మాదిరే ఇవి కూడా అని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే గచ్చిబౌలి ప్రాంతాలలో కూడా బోరబండలో జరిగినట్టే నీరు లోపలికి ఇంకిన తర్వాత భూమి పొరల్లో ఉండే గాలి బయటకు వచ్చి ఉంటుందని, ఆ శబ్దాలను విని జనం ఆందోళన చెంది ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.