టర్కీ, గ్రీసులో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు..!

Friday, October 30th, 2020, 11:30:27 PM IST


టర్కీ, గ్రీసులో భారీ భూకంపం సంభవించింది. ఏజియన్ సముద్రంలో అలజడి రేగడంతో సునామీ సంభవించింది. టర్కీలోని మెట్రోపాలిటన్ నగరమైన ఇజ్మీర్‌లో పదుల సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే ఓ భారీ భవంతి కుప్పకూలుతున్న దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే భూకంపం కారణంగా సంభవించిన చిన్నపాటి సునామీతో సముద్రపు నీరు వీధుల్లోకి చేరింది.

అయితే ఏజియన్ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ తెలిపింది. ఏజియన్ సముద్రంలో భూకంపం, సునామీ సంభవించడంతో తీర ప్రాంతాలైన టర్కీ, గ్రీస్‌పై ప్రభావం ఎక్కువగా ఉందని ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం లేదని ఇస్తాంబుల్ గవర్నర్ వెల్లడించారు.