ఢిల్లీలో భూకంపం.. భయంతో రోడ్లపైకి పరుగులు పెట్టిన జనం..!

Saturday, February 13th, 2021, 12:21:46 AM IST


దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీలోని ఎన్‌సిఆర్ ప్రాంతంలో నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ అంతటా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు రాత్రి 10.34 గంటల సమయంలో భూమి కంపించడంతో ఒక్కసారిగా జనాలు భయాందోళనకు గురై ఇళ్లనుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఢిల్లీలోనే కాకుండా పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాలలో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. భూకంపం సంభవించిన సమయంలో ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు, షాండీలియర్లు ఊగాయి. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది.