కూకట్ పల్లి లో భూకంపం…పరుగులు తీసిన జనం

Wednesday, January 13th, 2021, 01:00:37 PM IST

బుధవారం నాడు ఉదయం 9:25 గంటలకు కూకట్ పల్లీ లో భూ కంపం వచ్చింది. ఈ విషయాన్ని అక్కడ స్థానికులు వెల్లడించారు. కూకట్ పల్లి లోని అస్ బెస్టాస్ కాలనీ లో భూమి స్వల్పం గా కంపించీనట్లు తెలిపారు. అయితే భూమి కంపించడం తో ఇళ్ళ నుండి బయటికి పరుగులు తీసిన విషయాన్ని అక్కడి వాళ్ళు తెలిపారు. భూమి కంపించనప్పుడు పెద్ద శబ్దం వచ్చింది అని అంటున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.