ప్రారంభం అయిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి

Friday, September 25th, 2020, 11:55:45 PM IST

హైదరాబాద్ నగరం అత్యంత ఆధునిక జీవన విధానం లోకి అడుగులు వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఎట్టకేలకు ప్రారంభం అయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ బ్రిడ్జి ను ప్రారంభించారు. అయితే కలర్ఫుల్ గా కనిపిస్తున్న ఈ కేబుల్ బ్రిడ్జి చూపరులను కట్టిపడేస్తుంది. హైదరాబాద్ కి ఇది ప్రత్యేక ఆకర్షణ మాత్రమే కాకుండా, ఇక పై మాదాపూర్, జూబ్లీ హిల్స్ మద్య ట్రాఫిక్ సమస్య లు తీరిపోనున్నాయి.

అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇతర నాయకులు సైతం పాల్గొన్నారు. 184 కోట్ల రూపాయల వ్యయం తో 754.38 మీటర్ల పొడవున ఈ బ్రిడ్జి ఉండనుంది. అంతేకాక చెరువు కి ఇరువైపులా 20 మీటర్ల ఎత్తున దీన్ని నిర్మించడం జరిగింది. శని, ఆది వారాల్లో ఈ బ్రిడ్జి మీదికి ఎటువంటి వాహనాలను అనుమతించమని అధికారులు తెలుపగా, వారాంతాల్లో పర్యాటకులు కాలి నడకన వెళ్ళవచ్చు.