దుబ్బాక దెబ్బకు మూగబోయిన టీఆర్ఎస్ భవన్..!

Tuesday, November 10th, 2020, 05:24:38 PM IST

నరాలు తెగే ఉత్కంఠ.. మునుపెన్నడూ లేనంత సస్పెన్స్.. చివరి రౌండ్ లెక్కింపు వరకు విజయం దోబూచులాట.. కారు జోరుకు, కాషాయ జెండా పోరుకు జరిగిన టప్ ఫైట్‌లో ఎట్టకేలకు బీజేపీ విజయం సాధించింది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1,470 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే మొత్తం మీద బీజేపీకి 62,772 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 61,302 ఓట్లు, కాంగ్రెస్‌కు 21,819 ఓట్లు పోలయ్యాయి.

అయితే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఓటమి పాలవ్వలేదు. అయితే తొలిసారిగా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో టీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే కౌంటింగ్ మొదటి నుంచి టీఆర్ఎస్ వెనకబడే ఉండడంతో ఓటమిని ముందుగానే గ్రహించిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ కూడా హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర భవన్‌కు రాలేదు. దీంతో ఎన్నికల ఫలితం ఉన్నప్పుడు మొదటి సారి టీఆర్ఎస్ భవన్ బోసిపోయి కనిపించింది.